పాము - The Snake
Madhu Babu's Socio Crime Fantasy Thriller — Re-Mastered FULL Version
- Author / Contributor: Madhu Babu [Author]
- Language: Telugu
- Format: eBook
- Category: Folklore Fantasy
- Pages: 309
- Publication Year: 2026
- Publisher: LAVIN Visionaire
- Free Sample: 20% Preview on Google Play
About the Book
“పాము - The Snake” మధుబాబు రచించిన ఉత్కంఠభరితమైన సోషియో-క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్. రామాపురం రెండు గ్రామాలుగా విడిపోవడానికి దారితీసిన పాత విభేదాలు, గుట్టమీద దేవాలయం, నాగేంద్రస్వామి నిధి రహస్యం, భయానకమైన మహానాగం, విశ్వాసాలు మరియు గ్రామస్థుల మధ్య పెరుగుతున్న ఘర్షణల చుట్టూ కథ ఉత్కంఠగా సాగుతుంది.
విజయ్, భవ్య వంటి ప్రధాన పాత్రలతో పాటు, పాము చుట్టూ ఏర్పడే భయం మరియు గ్రామాల మధ్య సంఘర్షణ, కథకు మరింత ఉత్కంఠను జోడిస్తాయి.
--------------------------------------------------------
“రక్తం.... రక్తం.... రక్తం ధారలు కనిపిస్తోంది నాకు. నా పుట్ట వున్న గుట్ట మొదట్లో రక్తం కాలువలు కడుతున్నట్లు అనిపిస్తోంది. రండిరోయ్ రండి... అందరూ రండి... త్వరగా రండి. ఆ లలితమ్మ ఎక్కడ వున్నదో చూసి వెంటనే నా దగ్గిరికి తీసుకురండి” ఉన్నట్లుండి లేచి నిలబడుతూ గొంతు చినిగిపోయే శృతిలో కేకలుపెట్టడం మొదలుపెట్టింది గణాచారి.
ఊరి మధ్యలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఎదుట పెద్ద పందిరివేసి, హరికథలు చెప్పిస్తున్నారు గ్రామ పెద్దలు. రాత్రి ఎనిమిదింటికి మొదలు అయింది ఆ రోజు కథ... సుభద్రా పరిణయంలో అర్జునుడు సుభద్రను తీసుకుని ద్వారకా నగరంలో నుంచి పారిపోయి వచ్చే ఘట్టాన్ని రమ్యంగా చెపుతున్నాడు హరికథలు చెప్పటాన్ని నేర్చుకొచ్చిన ఆలయ పూజారి మనవడు.
“దీనిదుంపతెగ... కురుక్షేత్ర యుద్ధం కథ చెప్పేటప్పుడు నెత్తురు కనిపిస్తోందని కేకలు పెట్టటంలో అర్థం వుంటుంది. సుభద్రా కల్యాణంలో నెత్తురు నెత్తురంటూ లేచి నిలబడింది. దీనికి పట్టింది పూనకం కాదు. పిచ్చి... ఇది పూనకాల పిచ్చే. సందేహంలేదు” సన్నటి కంఠంతో తన పక్కన వున్న పెద్దాయనతో అన్నాడు ఒక పౌరుడు.
“ఎవడ్రా? ఎవడ్రా నన్ను వెక్కిరిస్తోంది? ఎవడ్రా అది?” కళ్ళను పెద్దవిచేసి కోరగా చూస్తూ చెవులు చిల్లులుపడే స్థాయిలో అతి బిగ్గరగా అరిచింది గణాచారి.
చటుక్కున నోటిని మూసుకుని తలక్రిందికి వంచేసుకున్నాడు ఆ పౌరుడు. పక్కనవున్న పెద్దాయన వెక్కిరింపుగా నవ్వినా ఏమాత్రం పట్టించుకోలేదు.
“లలితమ్మ... లలితమ్మను పిలవండిరా అంటే మూగమొద్దులమాదిరి అలా నిలబడిపోతారేమిటిరా? పిలవండిరా... వెంటనే నా దగ్గిరికి రమ్మని చెప్పండి” జుట్టు విరబోసుకుని తాచుపాము ఊగినట్లుగా ముందుకీ వెనక్కీ ఊగుతూ రెట్టించి అరిచింది గణాచారి.
--------------------------------------------------------
Copyright Disclaimer:
This ebook is an original work written by Sri. Madhu Babu and published by Vallabhaneni Maheedhar (LAVIN Visionaire). All rights are reserved. No part of this book may be reproduced, distributed, or transmitted in any form or by any means, including recording, copying, or uploading to the internet, without the prior written permission of the creator. Unauthorized use is a violation of copyright laws and will be subject to legal action.
#పాము #TheSnake #Paamu #MadhuBabu #మధుబాబు #TeluguNovel #TeluguBooks #TeluguThriller #CrimeThriller #FantasyThriller #SocioCrime #MysteryNovel #SnakeStory #NagaMystery #VillageThriller #TreasureMystery #Remastered #FullVersion #TeluguLiterature #August2026
Interactive Book Preview (20% Free Sample)
Preview not loading on your device? Open full 20% preview directly on Google Books.
Reader Reviews & Comments