రెడ్ షాడో - Red Shadow

రెడ్ షాడో - Red Shadow

Shadow Past Life Adventure (2 Volumes)

  • Author / Contributor: Madhu Babu [Author]
  • Language: Telugu
  • Format: eBook
  • Category: Shadow Past Life
  • Pages: 427
  • Publication Year: 1999
  • Publisher: LAVIN Visionaire
  • Free Sample: 20% Preview on Google Play

About the Book

షాడో సి.ఐ.బి. లో సీక్రెట్ ఏజెంట్‌ గా చేరక ముందు, దొంగతనాలు చేస్తూ నేరస్థుడిగా జీవితం గడుపుతున్నప్పటి కథల్లో ఇది ఒకటి. ఇండియన్ స్పెషల్ బ్రాంచి తనను అరెస్ట్ చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించబోతున్న సమయంలో, భారతదేశాన్ని వదిలి జపాన్ దేశానికి పారిపోయాడతను.

అక్కడ కుంగ్‌ ఫూ విద్యాపీఠంలో చేరి విద్యాభ్యాసం చేస్తున్న తరుణంలో, ఫ్యుజీశాన్ అనే కుంగ్‌ ఫూ వస్తాదుతో తగాదా పడతాడు. తత్ఫలితంగా జపాన్ దేశంలో కూడా నిలబడటం కష్టం అవుతుంది.

తనకు సంబంధించని అనవసరమైన పనుల్లో వేళ్ళుపెట్టి, దారిన పోయే కష్టాలనన్నింటినీ కోరి కోరి తల మీదకి తెచ్చుకోవడం బాగా అలవాటు అతనికి. అందుకే చైనాలో వున్న పటోలా బౌద్ధమత పీఠానికి వచ్చిన ఒకానొక ఆపదను కడతేర్చడం కోసం, ఆ వైపు ప్రయాణం చేశాడు.

ఆ కార్యాన్ని దిగ్విజయంగా నెరవేర్చిన తర్వాత, ఒక పడవలో చైనాను వదిలి కొరియా వైపు బయలుదేరాడు. చింజు పట్టణ పరిసరాల్లో బందిపోటు దొంగల దాష్టికానికి గురై అలమటించి పోతున్న ఆ ప్రజలను ఆదుకోవటానికి ప్రయత్నించి, అక్కడి పోలీసుల ఆగ్రహానికి గురయినాడు.

ప్రాణంలో ప్రాణమైన తన స్నేహితుడు గంగారాంతో కలిసి, అతను చింజు పట్టణం నుంచి పరుగు ప్రారంభించాడు. ఎటు పోవాలో, ఎక్కడికి పోవాలో తెలియదు. వెనకనుండి వచ్చి పడుతున్న కొరియన్ పోలీసుల్ని తప్పించుకోవటమే ఆ సమయంలో అతను చేయవలసిన పని. ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది “రెడ్ షాడో”

--------------------------------------------------------

Copyright Disclaimer:

This ebook is an original work written by Sri. Madhu Babu and published by Vallabhaneni Maheedhar (LAVIN Visionaire). All rights are reserved. No part of this book may be reproduced, distributed, or transmitted in any form or by any means, including recording, copying, or uploading to the internet, without the prior written permission of the creator. Unauthorized use is a violation of copyright laws and will be subject to legal action.

Interactive Book Preview (20% Free Sample)

Preview not loading on your device? Open full 20% preview directly on Google Books.

About LAVIN Visionaire (Lavin Digitals)
Official digital editions and translated classics of legendary Telugu novelist Sri Madhu Babu — available worldwide on Google Play Books & Audiobooks with 20% free preview.

Reader Reviews & Comments